Priya Anand Marriage.. నిత్యానందను పెళ్లి చేసుకుంటే, ఇంటి పేరు మార్చుకోవల్సిన పని లేదంటోంది అందాల భామ ప్రియా ఆనంద్. అదేనండీ, ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రియా ఆనంద్. రానా దగ్గుబాటి హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రియా ఆనంద్‌తో పాటూ, రిచా గంగోపాధ్యాయ కూడా నటించింది.
ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకూ ఇదే తొలి సినిమా. ఆ మాటకొస్తే, రానాకి కూడా. రానా సంగతి పక్కన పెడితే, రిచా గంగోపాధ్యాయ్ ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఓ మోస్తరు స్టార్డమ్ మూటకట్టుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసిందనుకోండి.
ఇక ప్రియా ఆనంద్ విషయానికి వస్తే, ఇప్పటికీ హీరోయిన్‌గానే కొనసాగుతోంది. కానీ, తెలుగులో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది. తమిళంలో సినిమాలు చేస్తోంది. తెలుగులో ఒకటీ అరా సినిమాలకే పరిమితమైంది ఈ ముద్దుగుమ్మ.
Priya Anand Marriage.. ప్రియా ఆనంద్, నిత్యానందను పెళ్లి చేసుకుంటుందా.?

కాగా, తాజాగా ప్రియా ఆనంద్ తన పెళ్లి విషయంలో ఓ సెటైర్ వేసి, నెట్టింట్లో వైరల్ అవుతోంది. నిత్యానందను పెళ్లి చేసుకుంటే, తాను ఇంటి పేరు మార్చుకునే పని లేదంటోంది. ఎందుకో అర్ధమైందనుకుంటా.. ఆమె పేరు చివర ఆనంద్ వుంది.. ఆయన పేరులోనూ ఆనందం వుంది. అదీ సంగతి.
అయితే, ఏంటీ.! కొంప తీసి ప్రియా ఆనంద్ ఆ నిర్ణయం తీసేసుకుందా.? అదే నిత్యానందను పెళ్లి చేసుకోవాలని.. అనుకుంటున్నారా.? ఆగండి.. జస్ట్ ఫన్నీగా కామెంట్ చేసిందంతే ప్రియా ఆనంద్. అలా అని నిత్యానందను కించపరచాలన్నది తన వుద్దేశ్యం కాదనీ, ఆయనకు బోలెడంత మంది భక్తులున్నారనీ చెప్పుకొచ్చింది.
ఇంతకీ ప్రియా ఆనంద్కి కాబోయే వరుడు ఎలా వుండాలో అనేదానిపై ఓ క్లారిటీ వుంది అమ్మడికి. శారీరక అందం లేకున్నా, మనసు మాత్రం మంచిదై వుండాలని తనకు కాబోయే వరుడి విషయంలో మనసులో మాట బయట పెట్టింది ప్రియా ఆనంద్.