‘ట్యాక్సీవాలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ ప్రియాంకా జవాల్కర్ (Priyanka Jawalkar). పదహారణాల తెలుగమ్మాయ్.
అరుదుగా మాత్రమే అవకాశాలు దక్కించుకుంటోంది. కానీ, సోషల్ మీడియాలో అమ్మడికి పిచ్చ క్రేజ్. ‘కలవరమాయె మదిలో’ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది.
కానీ, రౌడీ స్టార్‌తో నటించిన ‘ట్యాక్సీవాలా’ సినిమాతో యూత్‌కి క్రష్ అయ్యింది ఈ అనంతపురం ముద్దుగుమ్మ. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ సినిమాలో నటించింది.
Priyanka Jawalkar.. అది ఖచ్చితంగా దురాశే అవుతుందంటోంది..
అలాగే ‘తిమ్మరుసు’ తదితర ఒకట్రెండు సినిమాల్లో నటించింది ప్రియాంకా జవాల్కర్. తాజాగా ఈ ముద్దుగుమ్మ వద్దకు ఓ అరుదైన ప్రశ్న వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి.
పవర్ స్టార్‌తో నటించే ఛాన్స్ వస్తే మీరేం చేస్తారు.? అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు నిజంగా అలాంటి ఛాన్సే వస్తే నో చెబుతా.! అని సమాధానమిచ్చింది ప్రియాంకా జవాల్కర్.
అదేంటీ.! అంత పొగరా.? పవన్‌తో ఛాన్సొస్తే నో చెబుతావా.? అని గొడవేసేస్కోకండి పాపం పాపపై. అలా చెప్పడానికి ఓ పెద్ద కారణమే వుందట.
‘ఖుషీ’ ప్రభావం అంతలా..
పవన్ కళ్యాణ్ అంటే తనకు చచ్చేంత ఇష్టమనీ, ఆయనను అలా దూరంగా వుండి చూస్తేనే బాగుంటుందనీ, ఆయన పక్కన స్ర్కీన్ షేర్ చేసుకోవాలనేంత దురాశ తనకు లేదని చెప్పింది ప్రియాంక.
‘తమ్ముడు’ సినిమా ఏకంగా 20 సార్లు చూసిందట. ‘ఖుషి’ ఎన్ని సార్లు చూసిందో లెక్కే లేదట. అందులోని ప్రతీ డైలాగ్ నిద్రలో లేపి అడిగినా సరే చెప్పేస్తుందట అంతలా ఆ సినిమాని చూసేసిందట ప్రియాంక.
పవన్ కళ్యాణ్‌కి అంత వీరాభిమానినని చెప్పుకొచ్చింది ప్రియాంకా జవాల్కర్. అవును నిజమే, పవన్ అభిమానుల పిచ్చి అభిమానం ఇదే మాదిరి వుంటుందంతే.!