Pujita Ponnada
సైన్మా

Pujita Ponnada.! అందం అమ్మాయైతే.! నీలానే.!

‘రంగస్థలం’ సినిమాలో కుమార్ బాబు ప్రియురాలిగా నటించిన ముద్దుగుమ్మ గుర్తుంది కదా. ఆ అందాల భామ పేరే పూజీత పొన్నాడ (Pujita Ponnada). పదహారణాల తెలుగమ్మాయ్. తెలుగు తెరపై స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలగాలని ఆశపడుతోంది.

అన్ని రకాలుగానూ అందుకు సిద్ధపడి వచ్చింది. సహజంగానే తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో చోటు తక్కువ.. ఆ సమస్యను పూజిత పొన్నాడ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. అయినా కానీ, అవకాశాలు మాత్రం బాగానే దక్కించుకుంటోంది.

Pujita Ponnada.. సెలెక్టివ్ అయినా ఎప్పుడూ బిజీగానే..

స్టార్‌డమ్ పక్కన పెడితే, పూజిత పొన్నాడ చేతి నిండా ప్రాజెక్టులతో బాగానే తన ఉనికిని చాటుకుంటోంది. సెకండ్ హీరోయిన్, హీరోయిన్ సపోర్టింగ్ రోల్స్‌తో ఫుల్ బిజీగా గడిపేస్తోంది పూజిత పొన్నాడ.

ఇండస్ర్టీలో నిలదొక్కుకోవాలంటే వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. లక్కు చిక్కితే స్టార్‌డమ్ ఆటోమెటిగ్గా వరిస్తుంది.. అని నమ్ముతానంటోందీ అందాల తెలుగమ్మాయ్ పూజిత పొన్నాడ.

Pujita Ponnada
Pujita Ponnada

రీసెంట్‌గా ‘ఓదెల రైల్వేస్టేషన్’ అనే ఓటీటీ సినిమాలో అందంగా మెరిసింది పూజిత పొన్నాడ. ఇలాంటి చిన్నా చితకా ప్రాజెక్టులతో పాటూ, ఇటీవల కొన్ని పెద్ద ప్రాజెక్టులు టేకప్ చేసే దిశగా కూడా తన గుర్తింపును చాటుకుంటోంది పూజిత.

వీరమల్లు కోసం ‘స్పెషల్’ ఛాన్స్..

ఆ క్రమంలో పూజిత దక్కించుకున్న బెస్ట్ ఆఫర్ ‘హరి హర వీరమల్లు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ స్సెషల్ సాంగ్ కోసం పూజిత పొన్నాడ ఎంపికైంది.

పవర్ స్టార్ పక్కన స్టెప్పులేయడం తన కెరీర్ బెస్ట్ ఛాన్స్ అని తెగ మురిసిపోతోంది పూజిత పొన్నాడ. సినిమాలో ఈ సాంగ్‌కి చాలా స్పెషల్ ప్లేస్‌మెంట్ వుంటుందని చెబుతోంది.

అలాగే ఇప్పుడిప్పుడే తెలుగు బోర్డర్ దాటి తమిళ తంబీలను పరిచయం చేసుకునే దిశగా పూజిత పొన్నాడ అడుగులు కదుపుతోందట. చూడాలి మరి, తాను కోరుకున్న స్టార్‌డమ్ ఎక్కడ దక్కించుకుంటుందో పూజిత పొన్నాడ.

మరోవైపు సోషల్ మీడియాలో పూజిత పొన్నాడ ఓ హాట్ సెన్సేషన్. అమ్మడి అందాల పోజులకు బోలెడంత మంది ఫాలోవర్లున్నారు. ఆ ఫాలోవర్స్ కోసం ఎప్పటికప్పుడే హాట్ హాట్ అప్‌డేట్స్ ఇస్తూ కిర్రాక్ తెప్పిస్తుంటుంది పూజిత. తాజాగా శారీ లుక్స్‌తో కుర్రకారును తెగ కవ్వించేస్తోందీ ఘాటైన తెలుగందం.

Related posts

అవునా.! సుస్మితా సేన్‌కి పెళ్లయిపోయిందా.? ఎలాగంటే.!

admin

SrinidhiShetty KGF

admin

Sravanthi Chokarapu.. ‘బ్రా’బోయ్.! దిశా పటానీ ప్లేస్ కొట్టేద్దామనే.!

admin

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More