ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). రామ్ చరణ్, ఎన్టీయార్, అల్లు అర్జున్.. ఇలా ఈ జనరేషన్ స్టార్ హీరోలందరి సరసనా నటించేసింది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది.
టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన అభిమానం సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్లో కెరీర్ పీక్స్‌లో వున్నప్పుడే బాలీవుడ్‌పై కన్నేసిందీ అందాల భామ రకుల్.
Rakul Preet Singh.. ఫెయిల్యూర్స్‌కి భయపడలేదు..
‘అయ్యారీ’ సినిమాతో హిందీలో అడుగు పెట్టింది. తొలి ప్రయత్నంలో ఫెయిలైంది రకుల్. దాంతో, టాలీవుడ్లో అవకాశాలు వదిలేసుకుని వెళ్లినందుకు రకుల్‌కి బాగానే జరిగిందంటూ కొన్ని విమర్శలు కూడా వినిపించాయ్.
కానీ, రకుల్ కుంగిపోలేదు. పట్టుదలగా నిలబడింది. మరిన్ని అవకాశాలు దక్కించుకుంది. కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, మొత్తానికి సాధించింది రకుల్. సక్సెస్ అయ్యింది. అక్కడ స్టార్ హీరోయిన్లకు సైతం దక్కని అవకాశాలు రకుల్‌కి దక్కుతున్నాయ్.
వరుస సినిమాలతో రకుల్ పిచ్చ బిజీగా గడుపుతోంది బాలీవుడ్లో. అప్పుడప్పుడూ తెలుగులో మంచి అవకాశాలొస్తే, అస్సలు మిస్ చేసుకోవట్లేదు రకుల్. లటుక్కున పట్టేసి, చటుక్కున ఓకే చేసేస్తోంది. అలా రకుల్ నటించిన సినిమాలే, ‘చెక్’, ‘కొండపొలం’ తదితర సినిమాలు.

తనకు స్టార్డమ్ తెచ్చిపెట్టిన టాలీవుడ్ సినిమాని ఎప్పుడూ మర్చిపోననీ, ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులపై తనకు అభిమానం వుంటుందనీ రకుల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
నెట్టింట్లో రకుల్ గ్లామర్ సెగల్..
అలాగే, తమిళనాట కూడా రకుల్ ప్రీత్ సింగ్ బోలెడన్ని సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించింది. నటిస్తూనే వుంది. ఇక రీసెంట్గా బాలీవుడ్లో రకుల్ నటించిన మూడు సినిమాలు కొద్ది నెలల గ్యాప్‌లోనే రిలీజ్ అవ్వడం విశేషం.
మరోవైపు సినిమాలతో ఎంత బిజీగా వున్నా, రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా వుంటుంది. గ్లామర్ ఫోటో షూట్లతో రెచ్చిపోయి కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది.
తాజాగా అద్దాల బ్లౌజు ధరించి రకుల్ చేసిన గ్లామర్ హల్‌చల్‌కి నెటిజనం ఫిదా అవుతున్నారు. పసుపు పచ్చ చీర కట్టుకుని, స్లీవ్‌లెస్ అద్దాల డిజైన్ బ్లౌజ్‌తో రకుల్ ఇచ్చిన పోజులు నిజంగానే అద్భుతహ అనిపిస్తున్నాయ్. కావాలంటే ఈ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేస్కోండి.