Ram Gopal Varma Forgery.. రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు సంచలన దర్శకుడు.
ఇప్పుడైతే కాపీ మాస్టర్. సమాజంలో ఏదన్నా ఘటన జరిగినా, జరగకపోయినా.. జరిగిన ఘటనలోంచి పాత్రల్ని కాపీ కొట్టి సినిమా తీసేస్తాడు. జరగపోయినా, ఊహించేసి.. అందులో తనకు నచ్చినవాళ్ళనో, నచ్చనివాళ్ళనో ఇరికించేసి సినిమాలు తీసేస్తాడు.
ఫిలిం మేకర్ అనాలో, నిర్మాత అనాలో, దర్శకుడనాలో ఇంకేదన్నా పేరు పెట్టలో. వర్మ అయితే ఓ ‘కంపెనీ’ పెట్టి నానా చెత్తా తీసేసి, జనం మీదకు వదిలేస్తున్నాడు.
అలాంటి వర్మ తాజాగా ఫోర్జరీ కేసు పెట్టేశాడు ఓ నిర్మాత మీద. ఇలాంటి వివాదాల్ని ఎన్నిటినో చేసేసిన ఘనాపాటి ఆ నిర్మాత. అతనెవరో కాదు నట్టికుమార్. సరిపోయింది ఇద్దరికీ.!

కాపీ మాస్టారి ఫోర్జరీ కేసు.!
మీడియాకెక్కి నానా రకాలుగా తిట్టుకుంటున్నారు రామ్ గోపాల్ వర్మ, నట్టి కుమార్. న్యూస్ ఛానళ్ళకీ, వెబ్ మీడియాకీ ఇదో తరహా ఎంటర్టైన్మెంటు.!
నట్టి కుమార్ నిర్మాతగా ఏం సినిమాలు పీకాడు.? రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సంచనాలత్మక సినిమాలు తీశాడు.? ఇవన్నీ అనవసరం.
సోషల్ మీడియాలో పనీ పాటా లేని బ్యాచ్‌కి ఈ ఇద్దరూ కావాల్సినంత ఫన్ ఇస్తున్నారు. వాళ్ళని అలా చూపించడం తప్ప వేరే గతిలేని న్యూస్ ఛానళ్ళు, వాళ్ళిద్దర్నీ బతిమాలుకుని మరీ.. వారితో యాగీ చేస్తున్నాయ్.
ఏం ఖర్మ రా బాబూ ఇది.? అని జనం నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. ఫోర్జరీ అంటే, కాపీ కొట్టడమే. కాపీ కొట్టడంలో ిసద్ధహస్తుడైన రామ్ గోపాల్ వర్మ, ఫోర్జరీ కేసు పెట్టడం ఈ శతాబ్దానికే అతి పెద్ద కామెడీ.