మాతృభాష అయిన కన్నడ సినిమా పట్ల రష్మిక (Rashmika Mandanna) కు అస్సలు గౌరవం లేదనీ, తనకు నటిగా మొదటి అవకాశమిచ్చిన నిర్మాణ సంస్థ మీద కూడా రష్మికకు ఎటువంటి ఆసక్తి లేదనేది కన్నడిగుల ఆరోపణ.
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన కన్నడ సినిమా ‘కాంతార’ను భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ ప్రేక్షకులు అమితంగా ఆదరించారు.
విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాని పలువురు రాజకీయ ప్రముఖులు సైతం వీక్షించారు. అలాంటిది ఈ సినిమా చూశారా.? అని రష్మికను అడిగితే ఇంకా చూడలేదని రష్మిక చెప్పిన సమాధానం కన్నడిగుల్ని ఆగ్రహానికి గురి చేసింది.
Rashmika Mandanna.. కన్నడ సినిమాని రష్మిక లైట్ తీసుకుంటోందా.?
అలాగే, తను నటిగా డెబ్యూ చేయడానికి కారణమైన అంశాలేంటీ.? అని అడిగితే కూడా వేరే కారణాలు చెప్పింది కానీ, తన మొదటి సినిమా ‘కిర్రిక్ పార్టీ’ గురించి కానీ, ఆ డైరెక్టర్, నిర్మాణ సంస్థ పేరు కానీ ఎక్కడా ప్రస్థావించలేదు.
ఈ అంశం కన్నడిగుల్ని మరింత గుస్స అయ్యేలా చేసింది. దాంతో, రష్మికను బ్యాన్ చేయాలంటూ సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు కన్నడిగులు.
కన్నడ డైరెక్టర్ నాగశేఖర్ ఈ విషయంలో రష్మికకు తాను సపోర్ట్ చేయనని తెగేసి చెప్పేశాడు. ఎదుటి వారి నుంచి కృతజ్ఞతా భావం కోరుకోవడం కరెక్ట్ కాదనీ ఆయన అన్నారు. అంతేకాదు, రష్మికను బ్యాన్ చేయడం వల్ల కన్నడ పరిశ్రమే నష్టపోతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయ్.