Renu Desai.. ఈ మధ్య సెలబ్రిటీలు తమ అనారోగ్య సమస్యల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ షాకుల మీద షాకులిస్తున్న సంగతి తెలిసిందే.
సమంత, ఇలియానా.. ఇలా తాజాగా స్టార్ ముద్దుగుమ్మలు పలు రకాల వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.
ఆయా విషయాలను ట్రీట్‌మెంట్ ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అభిమానులతో షేర్ చేసుకున్నారు.
Renu Desai.. విషమంగా ఆరోగ్య పరిస్థితి
ఇప్పుడు రేణూ దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి, హీరోయిన్ అయిన రేణూ దేశాయ్ ఆరోగ్యం ఏమంత బాగా లేదు.
తనకు వచ్చిన అనారోగ్య పరిస్థితిని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది తాజాగా రేణూ దేశాయ్. కొన్నాళ్లుగా తాను తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నానని రేణూ దేశాయ్ రాసుకొచ్చింది.
వాటిని ఎదుర్కొనేందుకు ఎంతటి శక్తిని కూడగట్టుకుంటున్నానో మీకు చెప్పాలని వుంది.. అంటూ అభిమానుల్ని వుద్దేశించి రేణూ రాసుకొచ్చింది.
సానుభూతి కోసం కాదట..
కేవలం సానుభూతి కోసం తాను ఇప్పుడు ఈ విషయం తెలియ చెప్పాలనుకోవడం లేదనీ, ఎవరైనా నాలా బాధపడుతుంటే, వారిలో ధైర్యం నింపేందుకే ఇలా చెబుతున్నానని రేణూ దేశాయ్ తెలిపింది.
ఎలాంటి పరిస్థితుల్లో వున్నా, ధైర్యం కోల్పోవద్దనీ, ఎంతటి సమస్యలైనా నవ్వుతూ ఎదుర్కోవాలని, ఫలితం ఖచ్చితంగా వుంటుందనీ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తాను చికిత్స తీసుకుంటున్నాననీ, మంచి పోషకాహారం తీంటున్నానీ, యోగా తదితర వ్యాయామాలు చేస్తున్నాననీ త్వరలో కోలుకుంటాననీ చెప్పింది.