‘ఆర్ఆర్ఆర్’ సినిమా పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది. అంతర్జాతీయ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ (RRR)అరుదైన గౌరవం దక్కించుకుంది.
ఆస్కార్ తర్వాత అత్యున్నతమైన అవార్డు అయిన ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దక్కించుకుంది. ‘నాటు నాటు..’ సాంగ్‌కి ఈ అరుదైన అవార్డు దక్కింది.
ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందుకున్నారు. ఈ అవార్డు దక్కించుకోవడం అత్యద్భుతమనీ, ఇది తెలుగు సినిమా సాధించిన చారిత్రక విజయం అనీ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
RRR.. పోటెత్తుతోన్న ప్రశంసలు
స్వయానా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ని అభినందించారు. పలువురు సినీ ప్రముఖులు ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్‌ని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు.
ఆస్కార్ గ్రహీత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహ్మాన్.. ‘ఆర్ఆర్ఆర్’కి ఈ అవార్డు రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందనీ, నమ్మలేకపోతున్నాననీ తెలిపారు.
జక్కన్న అండ్ టీమ్ పడిన కష్టానికి పలితం దక్కిందని మురిసిపోతున్నారు. ఇక, ఆ ఒక్క కోరిక.. ‘ఆస్కార్’ కూడా దక్కించుకుంటే, తెలుగు సినిమా కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా.
చరణ్‌కి కింగ్ ఖాన్ స్వీట్ విన్నపం..
గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆనందానికి అవధుల్లేవ్. చరణ్, తారక్‌లకు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ తెలుపుతూ విషెస్ పోటెత్తుతున్నాయ్.
అన్నట్లు కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఒకింత భిన్నంగా రెస్పాండ్ అయ్యారు. చరణ్‌తో కింగ్ ఖాన్‌కి మంచి స్నేహం వుంది. ఆ చనువుతోనే కింగ్ ఖాన్ ఇలా రెస్పాండ్ అయ్యారు.
‘మీరు గోల్డెన్ గ్లోబ్ తీసుకుని ఇండియాకి వచ్చినప్పుడు ఒక్కసారి దాన్ని ముట్టుకునే అవకాశం కల్పించండి..’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.