Sai Pallavi Virata Parvam.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అనేయొచ్చు.! ఆ స్థాయిలో సాయి పల్లవికి అభిమాన గణం వుంది. మరీ ముఖ్యంగా తెలుగు నాట సాయి పల్లవికి ఏకంగా అభిమాన సంఘాలే వున్నాయ్.
పవన్ కళ్యాణ్ కోసం ఎలాగైతే అభిమానులు ‘పవనిజం’ అంటుంటారో, ఇది సాయి ‘పల్లవిజం’ అనుకోవాలేమో.! తన తాజా చిత్రం ‘విరాట పర్వం’ సినిమా కోసం చిత్ర యూనిట్ వెరైటీగా ఓ పబ్లిసిటీ ప్రోమో డిజైన్ చేసింది.. అదీ హీరో రానాతో.
రానా దగ్గరకి సాయి పల్లవి అభిమాని ఒకరు వస్తారు.. ఈ క్రమంలో రానాకి, సాయి పల్లవి అభిమానికీ మధ్య చిన్నపాటి ఫన్ నడుస్తుంది. సాయి పల్లవిని చూడాలనుకునే అభిమానుల కోసం కర్నూలులో ఈవెంట్ డిజైన్ చేశామని రానా చెబుతాడు.

ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో రూపంలో డిజైన్ చేసి, ప్రోమోగా వదిలింది ‘విరాట పర్వం’ టీమ్. కానీ, సాయి పల్లవి మాత్రం ‘ఇక్కడ అంత సీన్ లేదండీ..’ అనేసింది.
Sai Pallavi Virata Parvam.. అంత సీన్ లేదా.? అసలేంటి కథ.!
‘నేను చాలా లక్కీ.. అభిమానులు నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు. వాళ్ళందరినీ కర్నూలులో చూడాలని నేనే ఎదురుచూస్తున్నాను..’ అని పేర్కొంది సాయి పల్లవి.
ఇందుకే, సాయి పల్లవి అంటేనే అదో కిక్కు ఆమె అభిమానులకి. ‘పల్లవిజం’ అని ఊరకే అన్లేదు మరి.!
వేణు ఉడుగుల తెరకెక్కించిన ‘విరాట పర్వం’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. రానా, సాయి పల్లవి జంటగా నటించారు ఈ సినిమాలో. నక్సలిజం బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కింది.