సైన్మా

సాయి పల్లవికి ఏం తక్కువ.? పూజా హెగ్దేకి ఏం ఎక్కువ.!

Sai Pallavi vs Pooja Hegde.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాకి సంబంధించి బుట్టబొమ్మ పూజా హెగ్దేకి ఉత్తమ నటి అవార్డు దక్కింది. బాగానే వుంది. కానీ, ఈ అవార్డు విషయంలో పూజా హెగ్దేని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఒకింత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఏం.! పూజా హెగ్దే అందుకు అర్హురాలు కాదా.? అంటే, కాదని కాదు. కానీ, ఇక్కడ సాయి పల్లవితో పూజా హెగ్దేకి పోలిక గట్టిగా జరుగుతోంది.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘లవ్ స్టోరీ’ సినిమాలు దాదాపు ఒకే టైమ్‌లో వచ్చాయి. యాక్టింగ్ స్కిల్స్ పరంగా సాయి పల్లవికి అస్సలు వంక పెట్టేందుకే లేదు. అందరూ ఇది ఒప్పుకుని తీరాల్సిందే.

ఇక ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రెండు సినిమాలను గమనిస్తే, పూజా హెగ్దే, సాయి పల్లవి మధ్య ఉత్తమ నటి ఎవరనే పోటీ పెడితే, హండ్రడ్ పర్సంట్ సాయి పల్లవినే ఎంచుకుంటారు ఏకగ్రీవంగా.

Sai Pallavi Vs Pooja Hegde.. హండ్రడ్ పర్సంట్ సాయి పల్లవికే ఆ అర్హత

అలాంటిది 2021 ఉత్తమ నటి అవార్డుల్లో సాయి పల్లవిని పక్కన పెట్టేసి, పూజా హెగ్దేని ఎంచుకోవడం ఏంటీ.? అనేది కొందరు ఆడియన్స్ సూటి ప్రశ్న.

‘లవ్ స్టోరీ’లో సాయి పల్లవి నటన అత్యద్భుతం. చైల్డ్ ఎబ్యూజ్ క్యారెక్టర్ అయినా, హీరోతో ఆమె పండించిన ఎమోషనల్ సీన్స్ అయినా సినిమాకి ప్రాణం సాయి పల్లవి పాత్ర.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో స్టాండప్ కమెడియన్ రోల్ పోషించిన పూజా హెగ్డే. పాత్ర పరిధి మేరకు తన వంతు బాగానే యాక్ట్ చేసినా, ఈ పాత్రకు సంబంధించి ఆడియన్స్‌లో చాలా చాలా అభ్యంతరాలున్నాయ్.

సో, ఎలా చూసినా, ఉత్తమ నటి అవార్డు సాయి పల్లవిని కాక, పూజా హెగ్దేని వరించడం ఏమంత బాగా లేదనేది ప్రేక్షకుల అభిప్రాయం.

Related posts

నిత్యా మీనన్ పెళ్లంట.! వరుడు ఎవరంటే.!

admin

కృతి శెట్టికి ‘క్రష్’ ఎవరితోనో తెలిస్తే షాకవుతారుగా.!

admin

నయనతార చేసింది చిన్న పొరపాటు కాదు, పెద్ద నేరం.!

admin

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More