స్టార్ హీరోయిన్‌గా మకుటం లేని మహారాణిలా దూసుకెళ్లిపోతోంది టాలీవుడ్‌లో సమంత. ఎవరి దృష్టి తగిలిందో ఏమో కానీ, అరుదైన వ్యాధి బారిన పడి జీవితం అగమ్యగోచరంగా మారింది పాపం సమంతకు.
ఈ మధ్య మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి సమంత అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అరుదైన వ్యాధి కావడంతో, సమంత ఇకపై సినిమాల్లో నటించడం కుదరదా.? అంటూ కథనాలు వెల్లువెత్తాయ్ ఈ అంశంపై.
Samantha.. సమంతా.! నీ వెంటే మేమంతా.!
అయితే, అలాంటిదేం లేదనీ, త్వరలోనే సమంత కోలుకుంటుందనీ, తిరిగి తన కెరీర్‌ని కొనసాగిస్తుందనీ ఆమె అభిమానులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.
అవును నిజమే.! సమంత చాలా స్ట్రాంగ్ విమెన్. జీవితంలో ఎన్నో పోరాటాలు చవి చూసింది. తట్టుకుని గట్టిగా నిలబడింది. మయో సైటిస్ వంటి వ్యాధులు ఆమెని ఏమీ చేయలేవు.. అంటూ సమంతకు అందరూ ధైర్యం చెప్పారు.
సమంత కెరీర్ ఇకపై కూసింత కష్టమే.!
మొత్తానికి సమంత కోలుకుంది. త్వరలోనే ‘ఖుషీ’ షూటింగ్‌కి హాజరు కానుంది. అయితే, ‘జీవితం మునుపటిలా లేదు..’ అంటూ సమంత ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అవడం అభిమానులను ఆలోచనలో పడేసింది.
ట్విట్టర్‌లో ‘మీ జీవితం ఎలా నడుస్తోంది.?’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సామ్ ఇలా సమాధానమిచ్చింది. అంటే, మయోసైటిస్ సమంతను బాగా కుంగదీసిందని అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఆమె సమాధానం అలా వచ్చిందనుకోవాలేమో.
ఇక, ఇటీవల ‘యశోద’తో సక్సెస్ అందుకున్న సమంత, త్వరలో ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 17న ఈ సినిమాని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్లు ప్రకటించారు.