samantha-cheap-publicity-stunts
సైన్మా

సమంత చీప్ పబ్లిసిటీ స్టంట్లు: అందుకేనా.?

Samantha Cheap Publicity Stunts.. సమంత టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్. అందులో నో డౌట్. అయితే, ఈ మధ్య సమంత ఏ చిన్న విషయాన్నయినా తన పబ్లిసిటీకి వాడేసుకుంటోందన్న ఆరోపణలు వస్తున్నాయ్. తద్వారా సమంతపై చాలా నెగిటివిటీ పెరిగిపోతోంది.

అఫ్‌కోర్స్ ఆ నెగిటివిటీతో సమంతకు వచ్చిన ఇమేజ్ డ్యామేజ్ ఏమీ లేదు. కానీ, కావాలనే సమంత ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది అంటున్నారు ఆ నెగిటివిటీ స్ర్పెడర్స్.

సమంత తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ‘ఖుషి’ అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో పాటు, ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి సినిమాలు సమంత ఖాతాలో వున్నాయ్.

samantha-cheap-publicity-stunts

Samantha Cheap Publicity Stunts.. సమంత కావాలనే చేస్తోందా ఇదంతా..!

బాలీవుడ్‌‌కి సంబందించి కూడా సమంత చేతిలో క్రేజీయెస్ట్ ప్రాజెక్టులున్నాయన్న ప్రచారం కూడా వుంది. అయితే, బాలీవుడ్‌లో సమంత ఇంతవరకూ సినిమా చేసింది లేదు. ఇదిగో బాలీవుడ్ సినిమా అదిగో బాలీవుడ్ సినిమా అంటోందే కానీ, ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ తర్వాత సమంత చేసిన బాలీవుడ్ సినిమా ఏదీ లేదింతవరకూ.

అయితే, తన నిజ జీవితంలో జరిగిన విడాకుల ఇష్యూ తర్వాత, ఆమె జీవితం చాలా బాగుంది.. అని ప్రొజెక్ట్ చేసుకోవడానికే సమంత ఇలాంటి ప్రచారం చేసుకుంటోందా.? అనే అనుమానాలు లేకపోలేదు ఓ మేధావి వర్గంలో.

అంతా అలా అనుకోవాలనేనా.?

చేతిలో వున్న పీఆర్ టీమ్స్‌ని వాడుకునే, సమంత ఇలాంటి చీప్ ట్రిక్స్ ఫాలో చేస్తోంది.. అంటూ సో కాల్డ్ మేధావి వర్గం సమంతపై అవాకులు చవాకులు పేలుతున్నారు. నిజమే, ఇదంతా చూస్తుంటే, సమంత ప్రొజెక్షన్ వెనక వున్న సీక్రెట్ ఇదేనా.? అనిపిస్తోంది.

అలాగని సమంత ఏమంత ఖాళీగా లేదు. బాలీవుడ్‌లో ప్రముఖుల పార్టీల్లో ధగ ధగ మెరిసిపోతోంది. బాలీవుడ్ ప్రముఖ నటీనటులతో ఏదో ఒక సందర్భంలో పొగడ్తలు, కూడా కురిపించుకుంటోంది. ఎందుకీ హంగామా.? అంటే కూడా అందుకూ అదే ఆన్సర్ వస్తుంది. అదేనండీ, చీప్ పబ్లిసిటీ.

అయితే సమంత ఓ నటి. ఓ నటిగా తనకు ఏం కావాలో అదే చేస్తోంది సమంత. కొత్తగా చేసిందేమీ లేదు. కానీ, ఈ అటెన్షన్ చూస్తుంటే సమంత చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ అయినట్లే అనుకోవాలేమో మరి.

Related posts

అంత సీన్ లేదు: సాయి పల్లవి ఇలాగనేసిందేంటీ.!

admin

కృతి శెట్టికి ‘క్రష్’ ఎవరితోనో తెలిస్తే షాకవుతారుగా.!

admin

అద్దాల బ్లౌజులో Rakul Preet Singh అందాల విందు

admin

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More