విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల తనయగా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శృతిహాసన్ (Shruti Haasan). హీరోయిన్గా తనదైన గ్లామర్, పర్ఫామెన్స్తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత శృతి హాసన్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా స్టార్ హీరోలందరి సరసనా నటించేసి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది శృతి హాసన్.
తెలుగుతో పాటూ, తమిళ, హిందీ సినిమాల్లోనూ బిజీయెస్ట్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి.. అంటూ చేతులారా కెరీర్ పాడు చేసుకుంది.
Shruti Haasan.. అలా రియలైజ్ అయ్యింది.!
కొన్నాళ్లు డిప్రెషన్లోకి వెళ్లిపోయిన శృతిహాసన్, ఆ తర్వాత రియలైజ్ అయ్యింది. మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో శృతిహాసన్ జోరుకు బ్రేకులే లేకుండా పోయాయ్.
ఏకంగా చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. అలాగే, ప్రబాస్ వంటి ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్తోనూ ఆన్ స్ర్కీన్ రొమాన్స్‌కి సిద్ధమైంది.
అంతా బాగానే వుంది. కానీ, చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకోవడం పట్ల ఓ వర్గం నెటిజన్లు శృతిహాసన్‌ని ట్రోల్ చేస్తున్నారు.
ఆ హీరోలతో రొమాన్స్ ఏంటీ.? సిగ్గు లేదా.!
తండ్రి వయసున్న హీరోలతో రొమాన్స్ ఏంటీ.? ఛండాళంగా అని ఆడిపోసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లకి దిమ్మతిరిగే సమాధానమిచ్చింది శృతి హాసన్.
ఆర్టిస్టులకు ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. గతంలోనూ హీరోయిన్లు తమ కన్నా వయసులో చాలా పెద్దవాళ్లయిన హీరోలతో కలిసి నటించారు.
అందుకు నేనేమీ అతీతం కాదు.. అని అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. అవును నిజమే. నటనకు వయసుతో సంబంధం లేదు. అది తెలియకుండా కొందరు మూర్ఖంగా మాట్లాడుతుంటారంతే.
ఎంతైనా విశ్వనటుడు కమల్ హాసన్ తనయ కదా. ఆ మాత్రం స్పాంటేనిటీ, తెలివితేటలు వుంటాయ్ మరి.