అందాల భామ శృతిహాసన్ (Shruti Haasan) గురించి అందరికీ తెలిసిందే. అందమే కాదు, అంతకు మించి టాలెంట్స్ వున్నాయ్ శృతిహాసన్‌లో. పక్కా మల్టీ టాలెంటెడ్.
నటనతో పాటే, సింగింగ్‌లోనూ డిగ్రీలు పుచ్చుకుంది. అలాగే మంచి డాన్సర్ కూడా. నటి కాకముందే, పాప్ సింగర్‌గా బాగా పాపులర్ అయ్యింది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన శృతిహాసన్ మధ్యలో కొన్నాళ్లు మాయమైపోయింది. ప్రేమ, పెళ్లి గట్రా పర్సనల్ రీజన్స్ కారణంగా కెరీర్‌ని చేతులారా పాడుచేసుకుంది.
Shruti Haasan.. అలా జ్ఞానోదయమైంది
అయితే, ఇప్పుడు అమ్మడికి జ్ఞానోదయం అయ్యింది. మళ్లీ సినిమాల్లో రాణిస్తోంది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శృతిహాసన్ క్రేజీ ఆఫర్లతో దూసుకెళ్లిపోతోంది.
తాజాగా సంక్రాంతి పండక్కి ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలు శృతిహాసన్ కెరీర్లో అసలు సిసలు పండగని తీసుకొచ్చాయని చెప్పొచ్చు.
‘వాల్తేర్ వీరయ్య’ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవితో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేసిన శృతిహాసన్, ‘వీర సింహారెడ్డి’ కోసం బాలయ్యతో జత కట్టింది.
బాలయ్య నోట శృతి మాట..
అన్నట్లు బాలయ్య, శృతిహాసన్‌ని ‘రాక్షసి’ అని అభివర్ణించారు. అందుకు కారణం లేకపోలేదు. ఆయన తండ్రి రకరకాల పాత్రలతో మెప్పించారు. సినిమా కోసం చాలా కష్టపడిన వ్యక్తి ఆయన.
అదే జీన్స్ కదా.. ఆ పట్టు శృతిహాసన్కీ అచ్చంగా వచ్చేసింది. వర్క్ విషయంలో రాక్షసిలా పని చేస్తుంటుంది.. అని శృతిహాసన్ గురించి బాలయ్య చెప్పడం విశేషం.
‘క్రాక్’ సినిమా కోసం ఫైట్లు కూడా చేసేసింది. మా సినిమా ‘వీర సింహారెడ్డి’ కోసం చాలా కష్టపడింది.. అని శృతిహాసన్ గురించి గొప్పగా చెప్పారు బాలయ్య. తండ్రికి తగ్గ తనయ అని శృతిహాసన్ మీద పొగడ్తల వర్షం కురిపించారాయన.