‘లోఫర్’ బ్యూటీ దిశా పటానీకి హీరోయిన్గా ఇప్పుడున్న ఫేమ్ రావడానికి కారణం ఆమె ప్రమోట్ చేసిన ‘కాల్విన్ క్లెయిన్’ లోదుస్తుల బ్రాండే.
కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ లోదుస్తులకు దిశా పటానీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. దిశా పటానీ ఆధ్వర్యంలో ఆ బ్రాండ్‌కి దక్కిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. వరుసగా బికినీ ఫోటో షూట్లతో బ్రాండ్ నేమ్ ఎలివేట్ అయ్యేలా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది దిశా పటానీ.
Sravanthi Chokarapu.. ‘బ్రాండ్’ బ్యూటీలా మారిపోయిన ‘బుల్లి’తెర బ్యూటీ.!
అలా ఆ బ్రాండ్ యూత్‌కి బాగా కనెక్టయ్యింది. బ్రాండ్‌తో పాటూ, దిశా పటానీ కూడా బాగా పాపులర్ అయిపోయింది. ఆ బ్రాండ్ పేరు చెప్పి దిశా పటానీ చేసిన అందాల షోకి ఇన్‌స్సైర్ అయ్యి, వరుసగా సినిమాల్లో అవకాశాలిచ్చేశారు. దాంతో, బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్‌కి అసలు అందని ద్రాక్షలా మారిపోయింది.

సరే, అసలు ముచ్చట ఏంటంటే, ఇప్పుడీ బ్రాండ్‌కి తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఫీలవుతున్నట్లుంది బుల్లితెర భామ ‘స్రవంతి చోకరపు’. యాంకర్‌గా ఈ ముద్దుగుమ్మకు బుల్లితెరపై ఓ మోస్తరు పాపులారిటీ వుంది.ఓటీటీలో వచ్చిన బిగ్‌బాస్ నాన్ స్టాప్‌తో ఆ పాపులారిటీ ఇంకాస్త పెంచుకుంది.
ఇక, ఆ పాపులారిటీతోనే సోషల్ మీడియాలో స్రవంతి చేసే గ్లామర్ హల్చల్ అంతా ఇంతా కాదు. ఏ స్థాయి గ్లామర్ అయినా పండించేందుకు తాను సిద్ధం.. అన్నట్లుగా ఈ మధ్య హాటెస్ట్ ఫొటోల్ని సోషల్ మీడియా వేదికగా ఈ బ్యూటీ షేర్ చేస్తోంది. తాజాగా కాల్విన్ క్లెయిన్ బ్రా ధరించి హాట్ షోతో రెచ్చిపోయింది. ఇప్పుడీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయ్.