వార్తలు

బ్యూటీ విత్ ఇన్నోసెన్స్: ‘బిగ్’ ఎట్రాక్ట్ చేస్తున్న శ్రీ సత్య.!

Sri Satya Bigg Boss Telugu.. శ్రీ సత్య.. ఇప్పుడీ పేరు సోషల్ మీడియాలో హాట్ ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఎవరీ శ్రీ సత్య.? బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో ఓ కంటెస్టెంట్. సీరియల్ నటిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు.

‘నిన్నే పెళ్లాడతా’, త్రినయని’ తదితర సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోంది ఈ నటి. పదహారణాల తెలుగమ్మాయ్. విజయవాడ పోరీ. ఆకర్షించే ఫిగర్ వున్న అందాల రాక్షసి శ్రీ సత్య.

Sri Satya Bigg Boss Telugu.. నటి మాత్రమే కాదు, మోడల్ కూడా..

నిజానికి హీరోయిన్ అవ్వాలనుకుంది శ్రీ సత్య. కుదరలేదు. ప్రస్తుతానికి సీరియల్స్‌తో సరిపెట్టుకుంటోంది. నటనలో ఆరి తేరింది. డాన్సుల్లోనూ ధిట్ట. ట్రెడిషనల్ డాన్సయినా, వెస్ర్టన్ డాన్స్ అయినా ఇట్టే ఒదిగిపోతుంది శ్రీ సత్య. చక్కనమ్మ ఏం చేసినా అందమే కదా. శ్రీ సత్య స్టెప్పులేసినా అంతే అందంగా వుంటుంది.

గతంలో శ్రీ దేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన కొరియెగ్రఫర్ కమ్ జబర్దస్త్ కమెడియన్ రాము ఓ సూపర్ హిట్ సాంగ్‌కి కొరియోగ్రఫీ చేశాడు. ఆ డాన్స్ పర్ఫామెన్స్‌తో శ్రీ సత్య బుల్లితెర వీక్షకుల్ని మరింత మైమరిపించింది.

యాక్టింగ్‌కి రాకముందే శ్రీ సత్య మోడలింగ్ రంగంలోనూ రాణించింది. సినిమాలపై ఆసక్తితో మొదట బుల్లితెరను టచ్ చేసింది. బుల్లితెరపై రాణిస్తోంది. ఇక పెద్ద తెరపై హీరోయిన్ అనిపించుకోవడమే తన లక్ష్యంగా దూసుకెళుతోంది శ్రీ సత్య. అంతేకాదు, కొన్ని వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్‌లోనూ శ్రీ సత్య నటించింది.

బ్యూటీ విత్ ఇన్నోసెన్స్..

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో బ్యూటిఫుల్ కంటెస్టెంట్‌గా వుంది శ్రీ సత్య. గ్లామరస్ లుక్స్‌తో అమాయకత్వం నిండిన అందంతో వీక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది శ్రీ సత్య.

హౌస్‌లోకి రాక ముందే స్ర్టాంగ్‌గా పీ ఆర్ టీమ్స్‌ని సెట్ చేసుకుని వచ్చినట్టుంది. సోషల్ మీడియాలో శ్రీ సత్య పేరు మార్మోగిపోతోంది. ఇంతవరకూ హౌస్‌లో శ్రీ సత్య చేసిన స్పెషల్ పర్‌ఫామెన్స్ ఏం లేదు కానీ, తన బ్యూటిఫుల్ ఆటిట్యూడ్‌తో కెమెరాని ఫోకస్ చేస్తోంది. ఆడియన్స్ పల్స్ పట్టేస్తోంది.

చూడాలి మరి, శ్రీ సత్య బిగ్ హౌస్‌లో ఎన్ని వారాలు కొనసాగనుందో. అన్నట్లు బిగ్ బాస్ హౌస్‌లో వుంటున్నందుకు శ్రీ సత్య రోజుకి 30 వేలు రెమ్యునరేషన్ తీసుకుంటోందట.

Related posts

అయ్యో.! టీడీపీలో దివ్యవాణికి అంత అన్యాయం జరిగిందా.?

admin

కొత్త పెళ్లికూతుళ్లు: ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసా.?

admin

అందమైన ప్రయాణం: ఈ మిస్ ఇండియా గురించి మీకు తెలుసా.?

admin

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More