Srinidhi Shetty KGF Actress Secrets.. శ్రీనిధి శెట్టి.. ఒక్క సినిమాతో స్టార్డమ్ దక్కించేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అదేనండీ, ‘కేజీఎఫ్’ సినిమాలో హీరోయిన్గా నటించి ప్యాన్ ఇండియా రేంజ్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించింది అందాల భామ శ్రీ నిధి శెట్టి.
నిజానికి ఈ సినిమాతోనే సినీ పరిశ్రమకు పరిచయమైంది శ్రీ నిధి శెట్టి. అంతవరకూ ఆమెకు సినిమాల్లోకి వచ్చే ఆలోచనలే లేవట. కానీ, మోడలింగ్ రంగంపై ఆసక్తి ఎక్కువట శ్రీనిధి శెట్టికి.
పదవ తరగతి చదివే టైమ్‌లోనే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. అనేక అందాల పోటీల్లో పాల్గొని, కిరీటాలు దక్కించుకుంది. మోడలింగ్ పేరు చెప్పి దేశ,విదేశాలు చుట్టేసి వచ్చేసింది అందాల శ్రినిధి శెట్టి.
గ్లామర్ బొమ్మే కాదు, విద్యాధికురాలు కూడా..
కేవలం గ్లామర్‌పై ఆసక్తి మాత్రమే కాదు, శ్రీ నిధి శెట్టి మంచి విద్యావంతురాలు కూడా. టెన్త్ క్లాస్‌లో వున్నప్పుడు స్కూల్ టాపర్‌గా నిలిచిందట.
ఓ పక్క మోడలింగ్‌లో శిక్షణ తీసుకుంటూనే, మరోవైపు వున్నత చదువులు పూర్తి చేసి, సాఫ్ట్వేర్ రంగంలోనూ సత్తా చాటిందట. హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో వుద్యోగం కూడా చేసిందట శ్రీ నిధి శెట్టి.
ఆటిట్యూడ్‌తో పడగొట్టేసింది..
అనుకోకుండా ‘కేజీఎఫ్’లో హీరోయిన్గా ఛాన్సు దక్కించుకుంది. ఫ్రెష్ అండ్ హెవీ ఆటిట్యూడ్ వున్న అమ్మాయి తన సినిమాలో హీరోయిన్గా కావాలని ఆడిషన్స్ చేశారట.

ఆ ఆడిషన్స్‌లో తొలి చూపుతోనే శ్రీ నిధి శెట్టి, ప్రశాంత్ నీల్ దృష్టిని ఆకర్షించిందట. తన సినిమాలో హీరోయిన్ ఎలా వుండాలనుకున్నాడో, ఖచ్చితంగా అలాగే శ్రీ నిధి శెట్టి కనిపించడంతో వెంటనే ఓకే చేసేశాడట.
అయితే, అప్పటికే శ్రీ నిధి శెట్టి మోడల్‌గా చాలా చాలా బిజీగా వుండేదట. కానీ, తన ఫేవరేట్ హీరోల్లో ఒకరైన యష్ హీరోగా సినిమా అనేసరికి ఆ సినిమాలో నటించేందుకు ఒప్పేసుకుందట శ్రీ నిధి శెట్టి.
శ్రినిధిని అలా లాక్ చేసేసిన ప్రశాంత్ నీల్..
అలా ఆ సినిమాతో నటిగా పెద్ద తెరకు పరిచయమైంది శ్రీ నిధి శెట్టి. అనూహ్యంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం, దేశం గర్వంచదగ్గ సినిమాగా ‘కేజీఎఫ్’ గౌరవం దక్కించుకోవడంతో, అందరి దృష్టీ ఆమెపై పడింది.
అయితే, ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’తో పాటు, ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ కోసం కూడా శ్రీ నిధి శెట్టిని లాక్ చేసేశాడు ప్రశాంత్ నీల్. దాంతో అదే టైమ్‌లో తెలుగు, కన్నడ, తమిళ పరిశ్రమల నుంచి అరడజనుకు పైగా అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె వదులుకోవల్సి వచ్చిందట.
అయితే, ‘కేజీఎఫ్’ సిరీస్‌తోనే శ్రీనిధి శెట్టి కెరీర్లో గుర్తుండిపోయేంత స్టార్ డమ్ దక్కించేసుకుంది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విక్రమ్ సరసన ‘కోబ్రా’ మూవీలో నటిస్తోంది శ్రీనిధి శెట్టి.

తెలుగులోనూ మంచి అవకాశాలొస్తున్నాయట. ఎన్టీయార్ సినిమా కోసం శ్రీనిధి శెట్టి పేరు పరిశీలనలో వుంది. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ తో పోల్చితే, ‘ఛాప్టర్ 2’లో తన పాత్రకుగాను శ్రీనిధి శెట్టి ఇంకా మంచి పేరు తెచ్చుకుంది. దాంతో వరుసగా బిగ్ ప్రాజెక్టులు శ్రీనిధికి క్యూ కడుతున్నాయట.
అన్నీ కలిసొస్తే త్వరలోనే తెలుగులో ఓ స్టార్ హీరో సరసన శ్రీనిధి శెట్టి సందడి చేయడం ఖాయం.