Maheshbabu
సైన్మా

హ్యాపీ బర్త్ డే మహేష్: సరిలేరు నీకెవ్వరూ.!

Super Star Mahesh Babu: సూపర్ స్టార్లు ఊరికే అయిపోరు. అందుకు కొన్ని అర్హతలుంటాయ్. అలాంటి అర్హతలున్న స్టార్ హీరో మహేష్ బాబు. అందుకే, ఆయనను సూపర్ స్టార్ అని అంతా అభిమానంగా పిలుచుకుంటారు.

ఈ రోజు అనగా, ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో, ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ పోటెత్తుతున్నాయ్. పలువురు సెలబ్రిటీలు మహేష్‌ని కీర్తిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా మహేష్ బాబుకు స్పెషల్‌గా బర్త్‌డే విషెస్ తెలిపారు. చిన్నారుల గుండె చప్పుడు మహేష్ బాబుకి బర్త్ డే విషెస్ అంటూ చిరంజీవి, మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Super Star Mahesh Babu.. ప్రత్యేక అభిమానం..

బర్త్‌డేకి కొన్ని రోజుల ముందు నుంచే మహేష్ బాబు సూపర్ హిట్ సినిమాలైన ‘ఒక్కడు’, తదితర సినిమాలను ధియేటర్లలో ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.

రీ రిలీజ్ అయినప్పటికీ ఆయా స్పెషల్ షోలకు అభిమానులు పోటెత్తుతున్నారు.

Maheshbabu
Maheshbabu

అలాగే బర్త్ డే రోజు ‘పోకిరి’ సినిమాని స్పెషల్ షోగా ప్రదర్శిస్తున్నారు. దాదాపు 100 సెంటర్లలో 53 ధియేటర్లలో ఈ సినిమాని స్పెషల్‌గా ప్రదర్శిస్తున్నారు.

తెలుగు రాష్ర్టాలు రెండింట్లోనూ సూపర్ స్టార్ బర్త్ ‌డేని అభిమానులు సందడిగా జరుపుకుంటూ, సూపర్ స్టార్‌పై ప్రత్యేకమైన అభిమానం చాటుకుంటున్నారు అభిమానులు.

పేద చిన్నారుల పాలిట దేవుడు..

పేదపిల్లలకు గుండె సంబంధిత వ్యాధుల చికిత్స నిమిత్తం ఓ ఛారిటీని స్టార్ట్ చేసి, వారికి వుచితంగా గుండె ఆపరేషన్లను చేయిస్తున్నారు మహేష్ బాబు.

దాదాపు 1000 మందికి పైగా పేద చిన్నారులకు గుండె సంబంధిత శస్ర్తచికిత్సలు చేయించి తన మానవత్వాన్ని చాటుకున్నారు మహేష్ బాబు.

అలాగే తన తండ్రి సొంతూరు అయిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని, ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతున్నారు. తెలంగాణాలోనూ సిద్ధాపురం అనే గ్రామాన్ని దత్తత ద్వారా అభివృద్ది చేస్తున్నారు మహేష్ బాబు.

ఇవే కాదు, అనేక సామాజిక కార్యక్రమాల్లో మహేష్ బాబు తనదైన సాయం అందిస్తూనే వుంటారు. కరోనా టైమ్‌లోనూ ఉచితంగా వ్యాక్సిన్లు వేయించి సహృదయాన్ని చాటుకున్న స్టార్ మహేష్ బాబు. అందుకే, ఆయన సూపర్ స్టార్.

Related posts

పవన్ కళ్యాణ్ టైటిల్స్ మీద పడ్డారేంట్రా బాబూ.!

admin

రాజకీయాలంటే ఇష్టం, సినిమా అంటే భయం: పవన్ కళ్యాణ్

admin

నివేదా థామస్.. అందాల రాక్షసివే.! గుండెల్లో గుచ్చావే.!

admin

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More