మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ఓ ప్రయోగాత్మక సినిమా చేసింది. అదే ‘బబ్లీ బౌన్సర్’. నిజానికి, తమన్నా డీ గ్లామర్ లుక్‌లో కనిపించడం కొత్తేమీ కాదు.
కాకపోతే, ఈసారి ఇంకాస్త స్పెషల్ ఫిలిం అని చెప్పొచ్చు ‘బబ్లీ బౌన్సర్’ గురించి. మగాళ్ళేనా.? మహిళలూ బౌన్సర్లుగా రాణిస్తున్న రోజులివి.
ఇంతకీ, తమన్నా ‘బబ్లీ బౌన్సర్’లో ఏం చేసింది.? అది వేరే అంశం. సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.
అసలు అలా ఎలా చేస్తావ్ తమన్నా.?
తమన్నా అంటేనే గ్లామర్.! వెండితెరపై తమన్నా ప్రదర్శించిన రీతిలో అందాల విందు ఇంకెవరూ చేసి వుండరనడం అతిశయోక్తి కాదు.

అలాగని, తమన్నా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేయలేదా.? అంటే, చేసింది.. వాటితోనూ మెప్పించింది కూడా.!
తమన్నా అందగత్తె.. తమన్నా మంచి నటి.! సో, తమన్నా ప్రయోగాత్మక సినిమాలు చేస్తే ఎవరు మాత్రం తప్పు పట్టగలరు.?
Also Read: నివేదా థామస్‌కి అసలేమయ్యింది.?
Tamannaah Bhatia.. ఆ ప్రశ్నకి సమాధానం..
మీరు డీ గ్లామర్ రోల్స్ ఎందుకు చేస్తున్నారు.? అంటూ ‘బబ్లీ బౌన్సర్’ ప్రమోషన్స్‌లో ఎవరో అడిగితే, ‘గ్లామరస్ రోల్స్ చేశా.. పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేశా.. ఈ కథ బాగా నచ్చింది..’ అని సెలవిచ్చిందామె.
Also Read: Kayadu Lohar: అల్లు అర్జున్‌ని ఇబ్బందిపెట్టిన ఈ భామ ఎవరు.?
‘పుష్ప’ కథ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో వుంటుంది. ‘బబ్లీ బౌన్సర్’ కూడా ఇంచుమించు అలాంటిదేనని తమన్నా చెప్పడం గమనార్హం.