ఆట

ఊర్వశి రౌతెలాకి ఆ సరదా ఎక్కువయ్యిందే.!

Urvashi Rautela.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఈ మధ్య తరచూ వివాదాలతో సావాసం చేస్తోంది. రిషబ్ పంత్‌తో ‘సోషల్ ఫైట్’ చల్లారకముందే, ఇంకో వివాదంతో వార్తల్లోకెక్కింది ఊర్వశి రౌతెలా.

తాజాగా, ఓ పాకిస్తానీ క్రికెటర్‌తో ఇన్‌స్టా రీల్ చేసిన ఊర్వశి రౌతెలా, తీవ్రస్థాయి ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. భారత్ – పాక్ మధ్య జరిగిన ఓ టీ20 మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

సరే, క్రికెటర్లకీ.. సినీ తారలకీ మధ్య వున్న ‘స్పెషల్ బాండ్’ గురించి కొత్తగా చెప్పేదేముంది.? అందునా, పాక్ క్రికెటర్లకీ, భారత సినీ తారలకీ మధ్య ‘కనెక్షన్’ గురించి బోల్డన్ని గాసిప్స్ వినిపిస్తుంటాయ్.

ఊర్వశి రౌతెలా కూడా అదే బాటలో పయనిస్తోందంటూ, పాకిస్తానీ మద్దతుదారులు ‘ర్యాగింగ్’ చేయడంలో వింతేమీ లేదు కూడా.!

అయితే, టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌తో ఊర్వశి రౌతెలా ప్రేమాయణం బెడిసి కొట్టడం.. ఈ క్రమంలో ఇద్దరూ అక్కా, తమ్ముడూ.. అంటూ సోషల్ మీడయా వేదికగా సెటైర్లు వేసుకోవడం.. ఈ నేపథ్యంలో వివాదం కొత్త మలుపు తిరిగింది.

కేవలం, పబ్లిసిటీ స్టంట్స్‌లో భాగంగానే పాకిస్తానీ క్రికెటర్‌తో ఊర్వశి రౌతెలా ఆ ఇన్‌స్టా రీల్ చేసిందన్నది నిర్వివాదాంశం. ట్రోలింగ్ తీవ్రంగా జరగడంతో, చివరికి ఆ రీల్‌ని ఆమె తొలగించాల్సి వచ్చింది కూడా.

చేతిలో సినిమాల్లేక ఊర్వశి ఇలా దిగజారిపోయిందన్నది ప్రధానంగా వినిపిస్తోన్న విమర్శ. నిజానికి, మరీ అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమే కాదిది.

వివాదం ఎంత ముదిరితే అంత పబ్లిసిటీ వస్తుంది సినీ సెలబ్రిటీలకి. బహుశా ఊర్వశి కూడా ఆ కిక్కుని బాగా ఎంజాయ్ చేస్తుండొచ్చు.

Related posts

స్పూర్తి కెరటం: సిసలైన విజేత మిథాలీ రాజ్.!

admin

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More