Vedha Movie Review.. కొన్ని సినిమాలకు హీరోలూ, హీరోయిన్లూ.. అనే మాటే వుండదు. కంటెంటే హీరో. మౌత్ టాక్‌తోనూ పని లేదు.
ఒక్కసారి చూస్తే చాలు.. సినిమాలు ఇలాక్కూడా తీయొచ్చా.. అనిపిస్తుంది. హీరోలు మాత్రమే ఎగిరెగిరి ఫైట్స్ చేయాలా.? ఏం హీరోయిన్లు ఎందుకు చేయకూడదు.?
అలా చేస్తే అది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అంటాం కదా. కానీ, మనం చెప్పుకునే మూవీ ఏ కోవకి చెందుతుంది.? అనే దానికన్నా.. లేడీ క్యారెక్టర్లను ఇంత స్ర్టాంగ్‌గా చూపిస్తే ఎంత బావుంటుందో కదా.! అనిపిస్తుంది.
కథ కాదు, కథనంలోనే వుంది అంతా.!
అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ‘వేద’. ఇదో కన్నడ సినిమా. ఆడవాళ్లపై మరీ ముఖ్యంగా చిన్న పిల్లలపై జరిగే లైంగిక చేష్టల నేపథ్యంతో రూపొందిన సినిమా ఇది.
హీరో ఒక్కడే. కానీ, సినిమా నిండా హీరోయిన్లు అనదగ్గ లేడీ పాత్రలే. మైనర్ వయసులో తనపై జరిగిన లైంగిక దాడికి ప్రతీకారం తీర్చుకున్న ఓ అమ్మాయి కథే ‘వేద’.
కథలో కొత్తదనం ఏముంది.! అనుకుంటారా.? అంతా కథనంలోనే వుంది మరి. ఖచ్చితంగా చూడదగ్గ సినిమా ఇది. కథలో వచ్చే కొన్ని లేడీ పాత్రలను పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దిన వైనం మెచ్చుకోదగ్గది.
యాక్షన్ ఎలివేషన్స్ ఆడవాళ్లకు కూడా..
గాల్లో ఎగురుతూ ఆయా పాత్రలు చేసే యాక్షన్ స్టంట్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయ్. ఒకే ఒక్క హీరో.. ఆయనే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్.
తెలిసీ తెలియని వయసులో నిస్సహాయ స్థితిలో కొందరు కామాంధుల కాటుకు బలి అయిపోయిన కూతురికి తండ్రిగా శివ రాజ్ కుమార్ నటించారు.
ఆయన నటనతో పాటూ, ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన లేడీ పాత్రలు అందులో ఓ సెక్స్ వర్కర్ పాత్ర కూడా వుంది. అన్ని లేడీ పాత్రలూ బలమైనవే.
ఎందుకో తెలీదు విడుదలైన రోజే ధియేటర్ నుంచి లేపేశారు ఈ సినిమాని. ఆ మరుసటి రోజే ఓటీటీలో స్ర్టీమింగ్ చేశారు. పెద్దగా పబ్లిసిటీ లేదు. కానీ, అన్ని వర్గాల ప్రేక్షకులూ చూడదగ్గ సినిమా ‘వేద’.