నందమూరి నటసింహం బాలకృష్ణ (Veera Simha Reddy Preview) ఈ ఏడాది సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కించారు.
సినిమాకి మొదట్నుంచీ బజ్ బాగుంది. బాలయ్య శైలి మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా వున్నాయ్ ఈ సినిమాలో. శృతి హాసన్ హీరోయిన్గా నటించింది.
Veera Simha Reddy Preview.. పవర్ ఫుల్ ‘పంచ్’ డైలాగులు..
పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది.
బాలయ్యకు బాగా కలిసొచ్చిన రాయలసీమ బ్యాక్ డ్రాప్లో సినిమా తెరకెక్కింది. యాక్షన్ ఎపిసోడ్స్, బాలయ్య పవర్ ఫుల్ డైలాగులు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయ్.
అంతేకాదు, ఓవర్సీస్లోనూ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. గతంలో బాలయ్య సినిమాలకు ఎన్నడూ లేని విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ అక్కడ బాగా జరిగింది.
అఖండ ఎఫెక్ట్..
మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాని చాలా రిచ్‌గా నిర్మించినట్లు ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతోంది. బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా వున్నారు.
అసలే ‘అఖండ’ సినిమాతో తిరుగులేని హిట్ కొట్టి, ఫుల్ జోష్ మీదున్నారు బాలయ్య. ఆ సక్సెస్‌ని ‘వీర సింహారెడ్డి’తో బాలయ్య కంటిన్యూ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.