మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా ఈ సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. బాస్ పార్టీతో ఇప్పటికే సంక్రాంతి పండగ మొదలైపోయినట్లుంది మెగాభిమానులకి.
ఇక, ఒక్కొక్కటిగా వదులుతున్న ‘వీరయ్య’ అప్డేట్లకు మెగా ఫ్యాన్స్ ఖుషీ మాటల్లో చెప్పలేనిది. తాజాగా మరో లిరికల్ సాంగ్ వదిలారు ‘వీరయ్య’ అండ్ టీమ్.
శృతిహాసన్‌ని మెగాస్టార్ తనదైన శైలిలో పొగడ్తలతో ముంచెత్తుతోన్న పాట ఇది. ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ..’ అంటూ శృతిహాసన్ అందాన్ని పొగుడుతున్న ఆ పాట లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
Waltair Veerayya.. ఆరు పదుల నుంచి మూడు పదులకి..
శృతిహాసన్ అందాలకు మెగాస్టారే కాదు, కుర్రకారు సైతం ఫిదా అవుతోంది. ఆరు పదుల వయసున్న చిరంజీవి, శృతిహాసన్ అందంతో మైమర్చిపోయి మూడు పదుల వయసుకి తగ్గిపోయినట్లున్నారు.
ఆయనలోని గ్రేస్‌తో కూడిన తొందర చూస్తుంటే, మెగా అభిమానులకే కాదు, ఈ పాటలో ఆయన్ని చూసిన అందరికీ అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించిన ఈ సాంగ్‌కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రీ మూవీస్ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
మాస్ రాజా రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తుండగా, కేథరీన్ మరో హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ అందాల బ్యూటీ ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్‌లో నటించింది. సినిమా విజయంపై చిత్ర యూనిట్ చాలా చాలా నమ్మకంగా వుంది. చూడాలి మరి.