Waltair Veerayya Movie Review.. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్స్‌లో కనిపించిన సినిమా ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కింది.
రిలీజ్‌కి ముందే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయ్. ప్రమోషన్లతోనే పూనకాలు తెప్పించేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవి నటించిన పక్కా మాస్ కమర్షియల్ జోనర్ మూవీ ఇది.
ఇక, కథలోకి వెళితే, వాల్తేర్కి చెందిన వీరయ్య (మెగాస్టార్ చిరంజీవి), ఓ ఫిషర్ మేన్. సడెన్‌గా ఓ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని పోలీసులకు చిక్కుతాడు.
Waltair Veerayya Movie Review.. ఫిషర్ మేన్ – డ్రగ్స్ మాఫియా
ఆ తర్వాత తెలుస్తుంది. వేరే ఫిషర్ మేన్ చేసిన తప్పుకు తాను అరెస్టయ్యానని. ఆ తర్వాత వీరయ్య ఏం చేశాడు.? అసలు వీరయ్య ఎందుకు అరెస్టయ్యాడు. ఆ డ్రగ్స్ కేస్కి సంబంధించిన సీరియస్‌నెస్ ఏంటనేది.? తెలియాలంటే ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా చూడాల్సిందే.
చిరంజీవి గురించి ప్రత్యేకంగా ఏం చెప్పగలం.? ఆరు పదుల వయసు కాస్తా, మూడు పదులకు తగ్గిపోయింది ఈ సినిమాలో. తనదైన హ్యూమర్, తనదైన మాస్ అప్పీల్, కటింగ్స్‌తో పూనకాలు తెప్పించేశాడు.
శృతిహాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ, వున్నంతలో గ్లామర్‌తో మెప్పించింది. మాస్ రాజా రవితేజ ఈ సినిమాకి మరో అస్సెట్ అని ముందే చెప్పుకుంటూ వచ్చాం.
అలాగే, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు రవితేజ. మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్‌ని విజిల్స్ వేయిస్తాయ్. ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ తదితర కమెడియన్లు తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు.
టెక్నికల్ టీమ్ అద్భుతహ
టెక్నికల్ టీమ్ తనదైన పనితనాన్ని కనబరిచింది. తెరపై ఆ కష్టం సుస్పష్టంగా కనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ రాకింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు.
ఆర్ట్ వర్క్ అద్భుతహ. నిర్మాణ విలువల చాలా బాగున్నాయ్. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండేది. మాటలు, పాటలు ఆకట్టుకుంటాయ్.
చివరిగా అసలు సిసలు సంక్రాంతి సినిమా ‘వాల్తేర్ వీరయ్య’ అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తిరుగే లేదు, సంక్రాంతి సీజన్‌కి పక్కా మాస్ ఫీస్ట్ ఇచ్చేశాడు మెగాస్టార్ చిరంజీవి.