మెగాస్టార్ చిరంజీవి నటించిన 153 వ చిత్రంగా తెరకెక్కిన ‘వాల్తేర్ వీరయ్య’ (Waltair Veerayya Preview) చిత్రం ఈ సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ ఈ సినిమాని తెరకెక్కించారు.
అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటారో.. అచ్చం అలాగే ఈ సినిమాలో చిరంజీవిని చూపించాడు బాబి. ఒక్క బాబీనే కాదు, ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరూ చిరంజీవికి వీరాభిమానులే.
Waltair Veerayya Preview.. ‘మెగా’అభిమాన చిత్రమిది.!
ఏదో డబ్బులు తీసుకుని సినిమా కోసం పని చేస్తున్నాం.. అన్నట్లుగా కాకుండా చిరంజీవి అభిమానులంతా ఒక్క చోట చేరి ఈ సినిమా కోసం కమిట్మెంట్తో కష్టపడి పని చేశారనీ ఇప్పటికే చిరంజీవి పలుమార్లు చెబుతున్నారు.
ఆ అభిమానమే, ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులు నచ్చి, మెచ్చే సినిమా అవుతుందనడానికి నమ్మకం అని చిరు చెబుతున్నారు.
చిరంజీవి వయసు ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లుగా కనిపిస్తోంది సినిమాలో. ఉత్తరాంధ్ర యాసలో చిరంజీవి మాస్ డైలాగులు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నాయ్.
రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్ మ్యాజిక్..
దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాని మరో లెవల్ సక్సెస్ వైపు తీసుకెళుతోంది. శృతిహాసన్ అందాలు సినిమాకి సరికొత్త గ్లామర్ అద్దాయ్. అంతేకాదు, మరో హీరోయిన్ కేథరీన్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించింది.
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్, మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ సినిమాకి మాస్ రాజా రవితేజ అప్పియరెన్స్ మరో ప్రధాన ఆకర్షణ.
గతంలో ‘అన్నయ్య’ తదితర సినిమాల్లో చిరంజీవితో కలిసి రవితేజ నటించాడు. కానీ, అప్పటికి రవితేజ హీరోగా ఓ మోస్తరు అంతే. కానీ, ఇప్పుడలా కాదు. క్రేజీ స్టార్ హీరో.
మాస్ రాజా రవితేజ మరో ప్లస్.!
రవితేజ, మెగాస్టార్ చిరంజీవి మధ్య వచ్చే డైలాగులు, సన్నివేశాలూ.. సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ సినిమాకి అన్నీ ప్లస్లే.
మెగాభిమానులే కాదు, చిత్ర యూనిట్ సైతం ఈ సినిమా సక్సెస్‌ని ముందే ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో లేని విధంగా ప్రమోషన్లు కొత్తగా ప్లాన్ చేశారు.
సినిమా రిలీజ్ తర్వాత బోలెడన్ని సక్సెస్ మీట్స్ నిర్వహిస్తామని చెప్పడాన్ని బట్టి, సినిమా విజయంపై యూనిట్ ఎంత నమ్మకంగా వుందో అర్ధం చేసుకోవచ్చు.