Warina Hussain
సైన్మా

Warina Hussain నయా ఐటెమ్ బాంబ్ గురూ.!

వారినా హుస్సేన్.. ఇప్పుడీ పేరు టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండింగ్. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘బింబిసార’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించిన ముద్దుగుమ్మ పేరే వారినా హుస్సేన్ (Warina Hussain). తొలి సాంగ్‌తోనే విశేషంగా తెలుగు జనాల్నిఎట్రాక్ట్ చేసింది ఈ అందాల ఐటెం భామ.

‘బింబిసార’ సినిమా సూపర్ హిట్ కావడంతో, వారినా హుస్సేన్ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. ఈ మధ్య పలువురు హాట్ ఐటెం బాంబులు టాలీవుడ్ తెరపై తమ తమ హాట్ స్టెప్పులతో హీటెక్కించారు.

కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే పాపులర్ అయ్యారు. వారిలో మొదటి స్థానం ఈ వారినా హుస్సేన్‌కే దక్కుతుందేమో. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఛాన్స్‌లోనే ఏకంగా మెగా కాంపౌండ్‌ని టచ్ చేసేసింది.

Warina Hussain.. సెకండ్ అటెంప్ట్‌కే మెగా ఛాన్స్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన 154 మూవీ ‘గాడ్ ఫాదర్’లో ఈ స్పెషల్ ఐటెం బాంబ్ తన స్పెషల్ స్టెప్పులతో కాక రేపింది. అయితే, సీరియస్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో చిరంజీవికి డాన్స్ చేసే స్కోప్ పెద్దగా లేదు.

Warina Hussain
Warina Hussain

అలా చిరుతో కలిసి స్టెప్పులేసే చిరు అవకాశాన్ని తృటిలో తప్పించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏముంది. చిరంజీవి నటిస్తున్న చాలా సినిమాలు లైన్‌లో వున్నాయ్‌గా. వాటిలో ఇంకో ఛాన్స్ కొట్టకుండా వుంటుందా.? ఏంటీ.!

కలర్ ఫుల్లు చిలకా.!

ఫేమ్ వస్తే, వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్‌లో సెటిలైపోతుంది వారినా హుస్సేన్. అందుకు అన్ని అర్హతలూ కలిగి వుంది వారినా హుస్సేన్.

Also Read: నివేదా థామస్‌కి అసలేమయ్యింది.?

ఐటెం ముచ్చట అలా వుంటే, ఈ లోపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకునే దిశగా ప్రయత్నాలు మొదలెట్టేసింది వారినా హుస్సేన్.

హాట్ ఫోటో షూట్లతో కలర్ ఫుల్‌గా కుర్రోళ్లను ఆకర్షిస్తోంది. తాజాగా వారినా హుస్సేన్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ ‌చల్ చేస్తున్నాయ్. ఎవరీ అందాల పోరి.? అని ఆరా తీస్తే, అలా అమ్మడి గుట్టు మొత్తం రట్టయ్యిందన్నమాట.

Related posts

Rashmika Mandanna.. శ్రీ వల్లి స్పెషాలిటీ అదే మరి.!

admin

Adah Sharma.. ‘ఆద’ మరిచిన సోయగం.!

admin

నిత్యానందతో పెళ్లి: ‘లీడర్’ భామకు బెనిఫిట్ ఏంటో తెలుసా..!

admin

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More