వెండితెరపై తిరుగులేని స్టార్ డమ్ దక్కించుకుంది అందాల భామ సమంత. ఇటు తెలుగులోనే కాదు, అటు తమిళ, హిందీ పరిశ్రమల్లోనూ సమంత టాప్ రేంజ్ హీరోయిన్‌గానే చెలామణీ అవుతోంది.
అలాగే, ఆ మధ్య ‘ది ఫ్యామిలీ మేన్ 2’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ తెరపైనా అడుగుపెట్టింది. గతంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్‌కి ఇది సీక్వెల్‌గా రూపొందింది. తొలి సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. సెకండ్ సిరీస్ బంపర్ హిట్ అయ్యింది. అందుకు కారణం సమంత పర్మామెన్స్ అనడం అతిశయోక్తి కాదేమో.
ఫ్యామిలీ మేన్లో సమంత.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం..
ఈ సిరీస్ రిలీజ్‌కి ముందు పలు కాంట్రవర్సీలకు కేంద్ర బిందువయ్యింది. ముఖ్యంగా సమంత పాత్ర చాలా వివాదాస్పదమైంది. అయినా సమంత వెనక్కి తగ్గలేదు.
రిలీజ్ తర్వాత ఈ సిరీస్‌తో సమంతలోని నెక్స్ట్ లెవల్ నటిని చూసే అవకాశం దక్కింది ఆడియన్స్‌కి. అలాగే ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్‌లో సమంత పోషించిన పాత్రకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి కూడా.
సమంతలో ఆ యాంగిల్‌ని అంతవరకూ చూడని ఆమె అభిమానులు అవాక్కయిపోయారు. అంతలా ఆ పాత్రలో లీనమైపోయింది సమంత. హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు, బోల్డ్ సన్నివేశాల్లోనూ అలవోకగా నటించేసింది సమంత.
గెట్ రెడీ ఫర్ సమంత డబుల్ సెన్సేషన్..
ఈ సినిమాలో సమంత పర్ఫామెన్స్ చూశాకా ఓటీటీలో సమంత కోసం మరిన్నివిలక్షణ కథలు కూడా రూపుదిద్దుకుంటున్నాయట.
అందులో భాగంగా జయ శంకర్ అను విలక్షణ దర్శకుడు ఓ స్టోరీ సమంత వద్దకు తీసుకొచ్చాడట. ‘పేపర్ బోయ్’, ‘విటమిన్ సి’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాల దర్శకుడే ఈయన. కాగా, ఎకనమిక్ హిట్ మేన్ థీమ్ అను ఓ డిఫరెంట్ కాన్సెప్టుతో, కనీ వినీ ఎరుగని విధంగా ఓ సినిమా రూపొందించాలనుకుంటున్నాడట.

అసలేంటీ.. ‘ఎకనమిక్ హిట్ మేన్’ థీమ్..?
అయితే, సినిమాలా కన్నా, ఓటీటీ కంటెంట్‌గా ఈ కాన్సెప్టుకు ఎక్కువ ఆదరణ దక్కుతుందన్న యోచనలో వున్నాడట జయ శంకర్. ఆ నేపథ్యంలో ఈ కాన్సెప్టును సమంత ముందుంచినట్లు తెలుస్తోంది.
ఒక దేశాన్ని నాశనం చేయాలంటే, ఆ దేశ ఆర్ధిక పరిస్థితిని దెబ్బ తీస్తే చాలు.. ఇదే ఎకనమిక్ థీమ్ అంటే. ఈ థీమ్‌ని డైరెక్టర్ తనదైన శైలిలో ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఎలా చెప్పగలడన్నది చూడాలి మరి.
పెద్ద సాహసమే సుమీ..
ఒకింత ఈ కాన్సెప్టు కాంట్రవర్సీతో కూడుకున్నదే. జయశంకర్ పెద్ద సాహసమే చేయబోతున్నాడు. ఈ కంటెంట్ ఫ్లేవర్ చెడిపోకుండా జెన్యూన్‌గా తెరకెక్కించాలంటే, అందుకు ఓటీటీ వెర్షనే కరెక్ట్ అని జయశంకర్ అండ్ టీమ్ ఆలోచిస్తున్నారట.
ఓ ప్రముఖ బ్యానర్ ఈ ప్రాజెక్ట్‌ని టేకప్ చేయనుందనీ తెలుస్తోంది. అన్నీ సెట్టయ్యి సమంత ఈ కాన్సెప్టును ఓకే చేస్తే, మళ్లీ ఇదో హాట్ సెన్సేషన్ అవుతుందనడం అతిశయోక్తి అనిపించడం లేదు. చూడాలి మరి, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫైనల్ డీటెయిల్స్ త్వరలోనే వెల్లడి కానున్నాయట. అంతవరకూ లెట్స్ వెయిట్ అండ్ సీ.!
మరోవైపు సమంత పెద్ద తెర సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగులోనే మూడు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు సమంత చేతిలో వున్నాయ్. అలాగే, బాలీవుడ్‌లోనూ కొత్త ప్రాజెక్టలు సైన్ చేసే దిశగా సమంత ప్రయత్నాలు చేస్తోంది.
మరి ఈ తరుణంలో ఓటీటీ బొమ్మంటే కూసింత కష్టమే. అయినా కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా బిల్డప్ చేసుకోవాలంటే, అప్పుడప్పుడూ ఇలాంటి సాహసాలు తప్పవు మరి. సమంత ఎలా మ్యానేజ్ చేస్తుందో చూడాలి మరి.